Telangana: కొత్తపార్టీ ఏర్పాటుపై స్పీడ్ పెంచిన షర్మిల..క్షేత్రస్థాయి నుంచే ఫీడ్‌ బ్యాక్‌

Telangana: వైఎస్‌ షర్మిల స్పీడ్ పెంచేశారు. అన్ని జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ దూసుకువెళ్తున్నారు.

Update: 2021-02-20 14:40 GMT

షర్మిల ఫైల్ ఫోటో (TheHansIndia)

Telangana:తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటిచిన వైఎస్‌ షర్మిల స్పీడ్ పెంచేశారు. అన్ని జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, ఖమ్మం జిల్లా నేతలను కవర్‌ చేసి శబాష్‌ షర్మిల అని అనిపించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలను షర్మిల పలకరించారు. వైఎస్సార్‌ అభిమానులు, వైసీపీ నేతల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు.

YS Sharmilaతెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే సంకల్పం. వైఎస్సార్‌ పథకాలను అమలు చేయాలని ఆశయంతో కొత్త నినాదం వినిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు వైఎస్‌ షర్మిల. ఆమె స్పీడ్‌ చూస్తుంటే.. పార్టీ పెట్టడం పక్కా అని అర్థమైపోయింది. తాజాగా హైదరాబాద్‌, రంగారెడ్డి నేతలతో షర్మిల సమావేశమయ్యారు.

వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలను సంతోషపరిచాయని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణలో ఇంకా ఆయనకు అభిమానులు ఉన్నారని అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిన అవసరముందని మరోసారి స్పష్టం చేశారు.https://www.hmtvlive.com/telangana

మీటింగ్‌కు వచ్చిన అభిమానులకు ఫీడ్ బ్యాక్ పేపర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఎలా ముందడుగు వేస్తుందని అందరు భావిస్తున్నారు. సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుంటూనే.. క్షేత్రస్థాయి నుంచే ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకునే పనిలో పడింది షర్మిల. మొత్తానికి షర్మిల పయనం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.  

Tags:    

Similar News