YS Sharmila: కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
YS Sharmila: తెలంగాణ సొమ్మును కాజేశారు
YS Sharmila: కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
YS Sharmila: మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశ రాజకీయాలను శాసించేంతగా తెలంగాణ సోమ్మును కాజేశారని విమర్శించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచనని కేటీఆర్ చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆక్షేపించారు. చిన్నదొర చెప్పిన ఈ దశాబ్ధపు పెద్ద జోక్ ఇదేనని షర్మిల ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.