YS Sharmila: చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకు..?

YS Sharmila: నియంత నిర్ణయాలతో కేసీఆర్‌ తెలంగాణను భ్రష్టు పట్టించారు

Update: 2023-05-12 10:20 GMT

YS Sharmila: చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకు..? 

YS Sharmila: నియంత నిర్ణయాలతో సీఎం కేసీఆర్‌ తెలంగాణను భ్రష్టు పట్టించారని తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల. ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకుని ప్రశ్నించారు.

తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ.. పక్క రాష్ట్రాలవారికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి పనిచేస్తున్నారు. వీళ్ళు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? సమాధానం చెప్పండి కేసీఆర్? అంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు వైఎస్ షర్మిల.

Tags:    

Similar News