YS Sharmila: తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా పనిచేస్తా.. వైఎస్‌ఆర్ బిడ్డగా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటా

YS Sharmila: ఢిల్లీలో సోనియాతో వైఎస్ షర్మిల భేటీపై సర్వత్రా ఉత్కంఠ

Update: 2023-08-31 07:22 GMT

YS Sharmila: తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా పనిచేస్తా.. వైఎస్‌ఆర్ బిడ్డగా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటా

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్టయిందన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఢిల్లీలో సోనియాగాంధీతో షర్మిల సమావేశమయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఇక ఈ భేటీలో నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా పనిచేస్తానన్నారు షర్మిల. వైఎస్‌ఆర్ బిడ్డగా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనియాగాంధీతో షర్మిల భేటీ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియకు మార్గం సుగమం అయిందనే చర్చ జరుగుతోంది. పార్టీ విలీనం కోసమే కాంగ్రెస్ అధినేత్రితో షర్మిల సమావేశమయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అయితే పార్టీ విలీనంపై మాత్రం షర్మిల స్పందించలేదు.

Tags:    

Similar News