YS Sharmila: రైతుల్ని మోసగించిన ప్రభుత్వాలకు మనుగడ లేదు.. సీఎం కేసీఆర్ రైతుల్ని ఆగం చేశారు

YS Sharmila: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన, రైతులకు పరామర్శ

Update: 2023-04-30 02:56 GMT

YS Sharmila: రైతుల్ని మోసగించిన ప్రభుత్వాలకు మనుగడ లేదు.. సీఎం కేసీఆర్ రైతుల్ని ఆగం చేశారు 

YS Sharmila: వర్ష బీభత్సానికి కళ్లెదుటే నష్టపోయిన రైతులతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతోందని YSRTP అధ్యక్షురాలు YS షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల్ని ఆగం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల మండి పడ్డారు. మహబూబాబాద్ మండలం మాదవాపురం శివారు ధరావత్ తండాలో అకాల వర్షాలతో నష్టపోయిన వరి పంటను, కురవి మండలం అయ్యగారిపల్లి శివారు లో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో పంట చేతికి అంది వస్తుందనే సమయంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి నెలలో గాలి మోటార్ ఎక్కి పంట నష్టాన్ని ఏరియల్ సర్వే చేసి పదివేల రూపాయలను పరిహారం కింద అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పటిదాకా పైసాకూడా ఇవ్వలేదని విచారం వ్యక్తంచేశారు. రెక్కల కష్టంతో బతికే రైతుల్ని మోసగించిన వాళ్లకు పుట్టగతులు ఉండవని షర్మిల శపించారు. 

Tags:    

Similar News