Medak: రెండో రోజు ఏడుపాయల ఆలయం మూసివేత
Medak: మెదక్‌లో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని మూసివేశారు.
Medak: రెండో రోజు ఏడుపాయల ఆలయం మూసివేత
Medak: మెదక్‌లో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని మూసివేశారు. సింగూరు డ్యామ్ నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారి పొంగిపొర్లుతుంది. అమ్మవారి ఆలయం ఎదుట నది పొంగిపొర్లడంతో ఆలయాన్ని మూసివేశారు. ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు. మంజీర పర్యాటక ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.