Yadadri Temple Latest News: ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం

Yadadri Temple Latest News: తెలంగాణలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పునర్ నిర్మాణాన్ని చేపట్టింది.

Update: 2021-06-17 09:29 GMT

యాదాద్రి దేవస్థానము (ఫైల్ ఇమేజ్)

Yadadri Temple Latest News: తెలంగాణలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పునర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే ఇందు కోసం వేయి కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయడానికి 200 కోట్ల అవసరం అని అంచనా వేశారు అధికారులు. మే నెలలో పున ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి అడ్డంకిగా మారింది. అంతే కాదు మే 12 నుండి లాక్‌డౌన్ విధించింది సర్కార్. ఆలయంలో కూడా సిబ్బంది, పూజారులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన సిబ్బంది కూడా కరోనా వైరస్ సోకడంతో సొంత ఊళ్లకు వెళ్ళిపోయారు. ఫలితంగా పనులు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ వరకు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునః ప్రారంభం అయితే భక్తులు క్యూ లైన్ కడుతారు పనులకు ఇబ్బంది ఏర్పడుతుంది. పనులు అన్ని పూర్తి అయ్యాక ప్రారంభిస్తే. బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనులకు కూడా ఆటంకం కలగకుండా వేగంగా పూర్తవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతంశని, ఆదివారాలో 60 వేల మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రారంభం అయ్యాక ప్రతి రోజు లక్ష మంది దర్శనం చేసుకుంటారని అంచనా. అదే శని, ఆదివారాల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు అత్యంత వేగంగా ప్రసాదాలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రసాద అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆటోమెటిక్ లడ్డు తయారి యంత్రాలను తెప్పించారు. ప్రతి రోజు 3 నుంచి 4 లక్షల లడ్డూలను తయారు చేస్తారు.

ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా టెంపుల్ సిటీ చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్ ఆలయానికి మణిహారంలా నిలవబోతుంది. మరోవైపు దాతల నుంచి విరాళాలు సేకరించి, నిర్మాణ బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోవాలా? లేదా? కాటేజ్‌లను నిర్మించే బాధ్యతలను దాతలకు అప్పజెప్పాలన్న దానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం మాత్రం ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుదన్న అభిప్రాయంలో తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News