Dowry Harassment: మీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకెళ్లండి..

Hyderabad: రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది.

Update: 2023-04-08 04:41 GMT

Dowry Harassment: మీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకెళ్లండి..

Hyderabad: రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పెట్టిన చిత్రహింసలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌ లో రత్నదీప్ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక లోని బీదర్ జిల్లాకు చెందిన నందినితో తనకు వివాహం జరిపించారు తల్లిదండ్రులు. వారికి ఒక చిన్న బాబుకూడా వున్నాడు. అనోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఇది భరించలేని నందిని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఆ తర్వాత మీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకెళ్లడంటూ రత్నదీప్ నందిని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.

హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్న నందిని తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ నందిని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఒంటి పై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా నా బిడ్డను కొట్టి చంపేసారని కన్నీరుమున్నీరయ్యారు. గత కొన్న రోజులుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు చేస్తున్నారని నందిని ఫోన్‌ చేసి తన బాధను చెప్పుకుందని వాపోయారు. నందిని తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భర్త రత్నదీప్ అరెస్ట్ చేయగా.. అత్తమామ విజయ, లక్ష్మన్ రావు పరారీలో వున్నారు. 

Tags:    

Similar News