Woman Delivery in Forest: ప్రసవ వేదనలో నిండు గర్భిణి.. భుజాలపై మోసుకెళ్లిన భర్త..

Woman Delivery in Forest: ఎన్ని తరాలు మారినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో జీవించే ప్రజల బతుకు చిత్రం మాత్రం మారడంలేదు.

Update: 2020-07-19 05:45 GMT

Woman Delivery in Forest: ఎన్ని తరాలు మారినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో జీవించే ప్రజల బతుకు చిత్రం మాత్రం మారడంలేదు. తాగడానికి నీరు లేక, క‌నీసం క‌రెంటు, రోడ్డు, ఆస్పత్రి సౌకర్యం లేకుండా ఎన్నో కష్టాలకోర్చి బతుకును వెల్లదీస్తున్నారు. వీరికి కనీసం వైద్య సౌకర్యం లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో పోరాడుతూ పరుగులు తీస్తుంటే మరికొంత మంది మాత్రం ఊపిరిని వదిలేస్తున్నారు. అడవుల్లో, కొండ కొనల్లో నివసించే ఆదివాసీల ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరైన రహదారి సౌకర్యం, సమీపంలో ఆస్పత్రి లేక అడవిలోనే మ‌హిళ ప్రసవించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో ఎర్రంపాడుకి చెందిన కొవ్వాసి ఐతే అనే మహిళ నిడు గర్భిణి. కాగా ఆమె పురిటి నొప్పులతో బాధ‌ప‌డుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్ కి కాల్ చేశారు కానీ ఆ గ్రామానికి అంబులెన్స్ రావడానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో గర్భిణి భర్త ఆమెను తన భుజాలపైన మోసుకుంటూ కాలినడకలోనే ఎర్రంపాడు నుంచి చెన్నారం వరకు 3 కిలోమీటర్లు వెళ్లాడు. కాగా ఆయ‌న‌కు ఆశా కార్యకర్త సోమమ్మ స‌హాయం చేసింది. కాగా మరో సారి స్థానిక యువ‌కులు 108కి ఫోన్ చేయగా అంబులెన్స్ అక్కడికి చేరుకేనే లోపే మహిళ అడవిలోనే పురుడుపోసుకుంది. ఆ తరువాత కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో బాలింత‌ను, శిశువును ఎక్కించి సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం త‌ల్లి, కుమారుడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.


Tags:    

Similar News