Abdullapurmet: అన్నను ఆటోతో ఢీకొట్టి చంపిన శ్రీశైలం
Abdullapurmet: కక్షతోనే అన్నను హత్య చేసిన తమ్ముడు శ్రీశైలం
Abdullahpurmet: అన్నను ఆటోతో ఢీకొట్టి చంపిన శ్రీశైలం
Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్ మండలం మాజిద్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాంచందర్ హత్య కేసులో నిందితుడైన వ్యక్తి ఇంటిపై దాడి చేశారు మృతుడి కుటుంబసభ్యులు. దీంతో ఇంటి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. వరుసకు అన్న అయిన రాంచందర్‌ను శ్రీశైలం అనే వ్యక్తి ఆటోతో ఢీకొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. శ్రీశైలం హత్యకు పాల్పడినట్లు బయటపడింది. ఈకేసులో నిందితుడు శ్రీశైలంతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే నిందితుడు శ్రీశైలం కుటుంబం పరారీలో ఉండగా.. మృతుడి కుటుంబసభ్యులు ఇంటిపై దాడి చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.