Telangana News: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

Telangana News: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది.

Update: 2022-12-29 09:17 GMT

Telangana News: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

Telangana News: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి మద్యం అమ్మకాలపై సడలింపులు ప్రకటించింది. డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌ శాఖ అనుమతి ఇచ్చింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు వీలు కల్పించారు. రిటైల్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు పర్మిషన్ ఉండగా.. దీనిని డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే బార్లు డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు తెరచుకోవచ్చని చెప్పింది.

Tags:    

Similar News