షాకింగ్ న్యూస్.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్ష సూచన

కరోనా వైరస్ వ్యాప్తి ప్రజలను తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడిస్తుంది. చల్లటి వాతావరణంలోనే ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Update: 2020-04-04 10:55 GMT
Representational Image

కరోనా వైరస్ వ్యాప్తి ప్రజలను తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడిస్తుంది. చల్లటి వాతావరణంలోనే ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వేసవికాలం కావడం.. తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుందుని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం షాకింగ్ వార్త చెప్పింది. రానున్నమూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి జల్లుల నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. కోమెరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్రభావం ఏర్పడింది.

మరోవైపు దక్షిణ మధ్య మహారాష్ట్ర, పలు ప్రాంతాల్లో 1.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ప్రభావంతోనే తెలంగాణలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యాయి. రెండు రోజులు గరిష్ఠంగా 38.2 డిగ్రీలు, కనిష్ఠంగా 24.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. వర్షాలు కురిస్తే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిస్తే మరింత నష్టపోయే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన పడతున్నారు.


Tags:    

Similar News