Weather Updates in Telangana : తెలంగాణకు భారీ వర్షా సూచన..

Weather Updates in Telangana: ఆంధ్రప్రదేశ్ తీరానికి వద్ద పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

Update: 2020-07-04 01:59 GMT

Weather Updates in Telangana: ఆంధ్రప్రదేశ్ తీరానికి వద్ద పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు సకాలంలో రావడంతో... రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.శనివారం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం సైతం పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

ఆవర్తన ప్రభావంతో సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, యాదాద్రిభువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

దీనికితోడు నైరుతి రుతుపవనాలు సకాలంలో తోడు అవ్వడంతో ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కరోనా విస్పోటనం చెందిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ కొనసాగుతుండగా.. మరోవైపు వర్షాలు కురిస్తే.. అంటు వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News