Vishnu Vardhan Reddy: ఈ సారి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటా.. ఈవీఎంలో నా పేరు ఉంటుంది
Vishnu Vardhan Reddy: జూబ్లీహిల్స్ టికెట్ తనకు కేటాయించకపోవడంపై విష్ణువర్ధన్‌రెడ్డి అసంతృప్తి
Vishnu Vardhan Reddy: ఈ సారి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటా.. ఈవీఎంలో నా పేరు ఉంటుంది
Vishnu Vardhan Reddy: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా.. అజారుద్దీన్‌కు కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఎన్ని ఆఫర్లు వచ్చినా.. తన తండ్రి పార్టీ మనిషని కాంగ్రెస్‌ను వీడకుండా ఉన్నామని, కానీ.. ఈ విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తాను భావించలేదన్నారు.
పార్టీని డ్యామేజ్ చేయాలని తానెప్పుడూ అనుకోలేదని, అధిష్టానం తనతో ఒకసారి చర్చించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకులతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానన్న విష్ణువర్ధన్‌రెడ్డి.. తాను మాత్రం ఈ సారి కచ్చితంగా పోటీ చేసి తీరుతానని, ఈవీఎంలో తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.