Rice Mills: నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు
Rice Mills: నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపుదాడులు చేశారు.
Rice Mills: నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపుదాడులు చేశారు. పీడీయస్ బియ్యాన్ని రిసైక్లింగ్ చేస్తున్న మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సాలూరా, బోధన్, ఏడపల్లి, వర్ని, పోతంగల్ మండలాల్లోని రైస్ మిల్లుల్లో సోదాలు చేశారు. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మిల్లులతో పాటు కేసులు నమోదైన మిల్లుల్లో రైడ్స్ నిర్వహించారు.
సీఎంఆర్ బియ్యం స్టాక్ రిజిస్టర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ శశిధర్‌రాజ్ పరిశీలించారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌తో పాటు అతడి అనుచరులు తమ మిల్లులను ఇతరులకు అమ్మిన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైసు మిల్లుల్లో సోదాలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి మిల్లులు అమ్మినట్టు ఆధారాలు సేకరించారు. సాలూరా మండలంలోని తగ్గేలి మిల్లుకు పేర్లను మార్చినట్టు గుర్తించారు.