Mobile Coronavirus Testing Centers : మొబైల్‌ కరోనా పరీక్షాకేంద్రాలుగా వజ్ర బస్సులు

Update: 2020-09-13 04:59 GMT

Mobile Coronavirus Testing Centers

Mobile Coronavirus Testing Centers : కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆర్టీసీ సంస్థ పూర్తిగా నష్టాలలో కూరుకుపోయింది. అది సరిపోదన్నట్టు ఓ వైపు వజ్ర మినీ బస్సులు కూడా ఓ నష్టాలు మూటగట్టింది. అయితే ఇప్పుడు ఇవే బస్సులు కోవిడ్ పరీక్షలు చేసేందుకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇటీవలే ఓ 3 వజ్రా బస్సులను కోవిడ్‌ సంచార పరీక్షాకేంద్రాలుగా ప్రయోగాత్మకంగా మార్చారు. ఆ బస్సులను రవాణామంత్రి పువ్వాడ అజయ్‌ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా ప్రతి రోజు ఎంత లేదనుకున్నా సుమారుగా 750 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉండడంతో మరి కొన్ని బస్సులను సంచార ల్యాబ్‌లుగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇక ఇప్పట్లో కరోనా మహమ్మారి మనల్ని వదిలి వెల్లేట్టు లేకపోవడంతో ఈ సంచార ల్యాబ్ లను మిగిలిన జిల్లాలకు కూడా పంపించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఖాళీగా ఉన్న బస్సులను కరోనా సంచారా ల్యాబులుగా మార్చి వాటిలో ఒక్కో బస్సుల్లో ముగ్గురు టెక్నీషియన్లు ఉండేలా ఏర్పాటు చేశారు. అంతే కాదు కరోనా అనుమానితులు బస్సు వెలుపల నిలబడితే, కిటికీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా టెక్నీషియన్లు నమూనాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. మినీ బస్సులు కావటంతో ఇరుకు ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోగలుగుతున్నాయి.

ఇక ఈ సంచార ల్యాబ్ లుగా వజ్రా బస్సులను మార్చడానికి సుమారు రూ.1.15లక్షలు ఖర్చు వచ్చిందని అధికారులు తెలపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సంస్ధలో 100 వరకు వజ్రా బస్సులుంటాయి. కరోనా మహమ్మారి విస్తరించక ముందు వజ్రా బస్సులు బాగానే తిరిగేవి కానీ ఎప్పుడైతే కరోనా మహమ్మారి విస్తిరించడం ప్రారంభం అయిందో అప్పటి నుంచి అవి మూలన పడ్డాయి. అయితే కోవిడ్‌ సమస్య కారణంగా ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 వజ్రా బస్సులో యాక్సిడెంట్లు అయినవి, మరమ్మతులకు నోచుకోనివి పోను 66 బస్సులు కండీషన్‌లో ఉన్నాయి. దీంతో గతేడాది సమ్మె తర్వాత ఈ బస్సులను వేలం వేసి అమ్మేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు వీటిని కొనే అవకాశం ఉండటంతో ధర కూడా మెరుగ్గానే పలుకుతుందని ఆర్టీసీ భావించింది.

Tags:    

Similar News