ఏపీ రవాణా మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం లేదు: మంత్రి పువ్వాడ

ఏపీ రవాణా మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం లేదు: మంత్రి  పువ్వాడ
x
Highlights

అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో మంత్రుల స్థాయి సమావేశం లేదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక...

అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో మంత్రుల స్థాయి సమావేశం లేదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లో సమావేశం జరుగనున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఏపీ రవాణా మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం లేదన్నారు. కిలోమీటర్‌ బేసిస్‌లో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories