Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో యూరియా కొరత

Nizamabad: సొసైటీల వద్ద బారులు తీరిన రైతులు * జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ సొసైటీ వద్ద రాత్రి నుంచి క్యూలైన్

Update: 2021-08-03 03:38 GMT

నిజామాబాదు జిల్లా రైతులకు యూరియా కొరత (ఫోటో ది హన్స్ ఇండియా)

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో యూరియా కొరత.. రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సొసైటీల వద్ద యూరియా కోసం బారులు తీయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా అక్కడే గడపాల్సి వస్తోంది. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ సొసైటీ వద్ద రాత్రి నుంచి క్యూలైన్‌లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టి.. అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. యూరియా సరఫరా తగ్గిపోవడం, వినియోగం పెరిగిపోవడంతో  గత సీజన్‌ స్టాక్‌తో సర్దుబాటు చేస్తున్నారు అధికారులు.

 యూరియా కొరతకు సొసైటీల అలసత్వం, అధికారులకు నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. పొలాలకు యూరియా చల్లాల్సిన సమయంలో.. అది లేకపోవడం  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. 20 రోజులుగా సొసైటీలో యూరియా లేకపోవడం దారుణమని, అధికారులు ఇప్పటికైనా స్పందించి, రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News