Subhash Reddy: బలి ఇచ్చే మేకకు కూడా నీళ్లు పోసి బలిస్తారు.. నేనేం తప్పు చేశానని టికెట్ ఇవ్వలేదు..?
Subhash Reddy: 10 రోజులు వేచి చూస్తా.. తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా
Subhash Reddy: బలి ఇచ్చే మేకకు కూడా నీళ్లు పోసి బలిస్తారు.. నేనేం తప్పు చేశానని టికెట్ ఇవ్వలేదు..?
Subhash Reddy: బీఎర్‌ఎస్ టికెట్ ప్రకటించకపోవడంతో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాను ఏం తప్పు చేశానని టికెట్ నిరాకరించారని ప్రశ్నించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన అనుచురుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదా అంటూ ప్రశ్నించారు. బలిచ్చే మేకకు కూడా నీళ్లు పోస్తారు, ఉరితీసేవాడిని కూడా ఆఖరి కోరిక అడుగుతారు, కానీ తనకు అలాంటి అవకాశమే లేకుండా చేశారన్నారు. తన కంటే తర్వాత పార్టీలో చేరిన పద్మారావు గౌడ్‌కు మంత్రి, డిప్యూటీ సీఎంగా అవకాశమిచ్చారని సుభాష్‌రెడ్డి అన్నారు.