పెద్దపల్లి జిల్లాలో తుపాను బీభత్సం.. నీట మునిగిన వేలాది ఎకరాల పంట

అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. తుపాను బీభత్సంతో చేతికి అందిన పంట‌ నేల పాలైంది.

Update: 2025-10-30 09:59 GMT

పెద్దపల్లి జిల్లాలో తుపాను బీభత్సం.. నీట మునిగిన వేలాది ఎకరాల పంట 

అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. తుపాను బీభత్సంతో చేతికి అందిన పంట‌ నేల పాలైంది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో పెద్దపల్లి జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, మొక్కజొన్న పత్తి తో పాటు ఇతర పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీటి పాలు కావడం తో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమకు పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

కాల్వ శ్రీరాంపూర్ శివాలయ వీధిలో ఇండల్లోకి వర్షపు నీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. కొన్నిచోట్ల వరి ధాన్యపు కుప్పలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరద దాటికి ధాన్యం కొట్టుకుపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Tags:    

Similar News