Mancherial: స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక యువకుడు సూసైడ్

Mancherial: అఖిల్ మరణాన్ని తట్టుకోలేక గోదావరిలో దూకి మోహన్ ఆత్మహత్య

Update: 2023-10-06 06:36 GMT

Mancherial: స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక యువకుడు సూసైడ్

Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక మరో స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అఖిల్, మోహన్ ప్రాణ స్నేహితులు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. కుటుంబ సభ్యులు మందలించారని అఖిల్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్రెండ్ సూసైడ్‌ను జీర్ణించుకోలేని మోహన్... ఇందారం గోదావరి దగ్గర వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టేకుమట్ల శివారులో మోహన్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News