Kamareddy: కామారెడ్డి ఆసుపత్రిలో ఎలుక కరిచిన ఘటనపై ఇద్దరు డాక్టర్లు, నర్స్ సస్పెండ్

Kamareddy: నిన్న ICUలో చికిత్స పొందుతున్న రోగిని కొరికిన ఎలుకలు

Update: 2024-02-12 06:33 GMT

Kamareddy: కామారెడ్డి ఆసుపత్రిలో ఎలుక కరిచిన ఘటనపై ఇద్దరు డాక్టర్లు, నర్స్ సస్పెండ్

Kamareddy: మారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ‍ఐసీయూ వార్డులో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఐసీయూ విభాగంలోని డాక్టర్లు వసంత్ కుమార్, కావ్య, నర్సింగ్ ఆఫీసర్ మంజులపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నిన్న ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరవడంతో తీవ్రగాయాలయ్యాయి.

Tags:    

Similar News