సోషల్‌ మీడియాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ట్వీట్ వార్

BJP And Congress: సోషల్‌మీడియాలో ఇరు పార్టీల మధ్య ట్వీట్ల యుద్ధం

Update: 2023-10-07 05:28 GMT

సోషల్‌ మీడియాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ట్వీట్ వార్

BJP And Congress: సోషల్‌మీడియాలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. బీజేపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫొటోను రావణ్‌గా మార్ఫ్ చేసి పోస్టు చేసింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ ఫొటోను మార్ఫ్ చేసి పోస్టు చేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య ట్వీట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ‌్యంలో బీజేపీ వైఖరికి నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనల కార్యక్రమాలను చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News