YS Sharmila: విలీనానికి వేళాయే.. ఢిల్లీలో బిజీ బిజీగా వైఎస్ షర్మిల
YS Sharmila: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న షర్మిల
YS Sharmila: విలీనానికి వేళాయే.. ఢిల్లీలో బిజీ బిజీగా వైఎస్ షర్మిల
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా బెంగుళూరులో మకాంవేసిన షర్మిల, నిన్న ఢిల్లీ పెద్దలతో షర్మిల చర్చలు జరిపింది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్యవర్తిగా కీలక పాత్ర పోషించారు. అన్నీ కలిసొస్తే... ఆగస్టు 15వ తేదీన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని సమాచారం.
అయితే పార్టీ విలీనానికి ముందుగా షర్మిల షరతులు విధించినట్లు సమాచారం. తెలంగాణలోని పాలేరు అసెంబ్లీ స్థానంనుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. అలాగే పార్టీలో కీలక పాత్ర పోషించిన కొందరికి కొన్ని అసెంబ్లీ స్థానాలను ప్రతిపాదించినట్లు సమాచారం. షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాదర్ంగా స్వాగతిస్తున్నారు.