TS Govt: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో గుడ్‌న్యూస్
TS Govt: అలవెన్స్‌లు పెంచుతూ ఉత్తర్వులు జారీ
TS Govt: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో గుడ్‌న్యూస్
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్‌న్యూస్.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అలవెన్స్‌లను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం.. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ 2వేల రూపాయల నుంచి 3 వేల రూపాయలకు పెంచింది ప్రభుత్వం.
ఇక ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని 20 లక్షల నుంచి 30లక్షలకు.. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని 6 లక్షల నుంచి 9 లక్షలక.. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి లక్షకు పెంచింది. పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం 20 వేల నుంచి 30 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.