Kaushik Reddy: నాకు ఎమ్మెల్సీగా సంతృప్తి లేదు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ..
Padi Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kaushik Reddy: నాకు ఎమ్మెల్సీగా సంతృప్తి లేదు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ..
Padi Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీగా తాను చేయవల్సిన పనులన్నీ చేస్తుననానన్న ఆయన.. అయినప్పటికీ తనుకు మానసిక సంతృప్తి కలగడం లేదన్నారు. తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే తను సంతృప్తి కలుగుతుందన్నారు. ఇప్పటికైనా హుజరాబాద్ ప్రజలు నమ్మి గెలిపిస్తే తానేంటి నిరూపించుకుంటామన్నారు. మీ దండం పెట్టి అడుగుతున్నా తనను హుజురాబాద్ లో గెలిపించాలని ప్రాదేయ పడ్డాడు. వీణవంక మండలం కొండపాక గ్రామంలో కొత్త గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని అన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యలు తీరుస్తానని చెప్పారు.