Narayanpet: పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య.. కారణం అదేనా!

Narayanpet: నారాయణపేట జిల్లా కోస్గిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళైన మూడు రోజులకే చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు శ్రీలత అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Update: 2025-10-31 05:58 GMT

Narayanpet: పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య.. కారణం అదేనా!

Narayanpet: నారాయణపేట జిల్లా కోస్గిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళైన మూడు రోజులకే చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు శ్రీలత అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 26న భీమవరం గ్రామానికి చెందిన ఓ యువకుడితో శ్రీలతకు వివాహం జరిగింది. 28న శ్రీలత పురుగుల మందు తాగటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

చంద్రవంచ గ్రామానికి చెందిన ఓ యువకుడి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రుల ఆరోపించారు. న్యాయం చేయాలంటూ తాండూర్ ప్రధాన రహదారిపై మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News