Telangana: అయ్యో దేవుడా.. కారు కింద పడి 13 నెలల చిన్నారి మృతి..

Kamareddy: కారును రివర్స్‌ చేసిన బాలుడి పెదనాన్న

Update: 2023-04-10 04:23 GMT

Telangana: అయ్యో దేవుడా.. కారు కింద పడి 13 నెలల చిన్నారి మృతి.. 

Kamareddy: కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఓ 13 నెలల బాలుడు కారు కింద పడి మృతి చెందాడు. సిద్దం స్వామి కారు ఇంటి నుంచి బయటకు తీస్తుండగా కారు వెనకాలే ఆడుకుంటున్న 13 నెలల కొడుకు అయాన్షు తలపై నుంచి కారు వెళ్లింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News