Traffic Restrictions: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా.. నెక్లెస్ రోడ్ లో రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు
Traffic Restrictions: ఐమ్యాక్స్ థియేటర్ వెనకాల ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ
Traffic Restrictions: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా.. నెక్లెస్ రోడ్ లో రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు
Traffic Restrictions: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను మళ్లించనున్నారు.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి..
వంద కోట్లతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడుతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకను అట్టహాసంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నెక్లెస్ రోడ్ తదితర మార్గాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విగ్రహావిష్కరణ అనంతరం ఐమ్యాక్స్ థియేటర్ వెనకాల ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి గెస్ట్ లు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు..
పివీ స్టాచ్యూ -నెక్లెస్ రొటరీ- ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు తెలుగు తల్లి జంక్షన్‌ల మధ్య వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రొటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదన్ నిరంకారి వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి పీవీఎన్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను సొనబాయ్ మజీద్ నుంచి రాణిగంజ్ వైపు డైవర్ట్ చేస్తారు. రసూల్‌పూర, మినిస్టర్ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రొటరీ వైపు వెళ్లే వారిని నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వద్ద దారి మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలను తెల్లి తల్లి ఫ్లైఓవర్ వద్ద ఇక్బాల్ మీనర్ వైపు మళ్లిస్తారు. BRK భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు వాహనాలను అనుమతించరు. వీరిని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ గణేష్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రొటరీకి వాహనాలను అనుమంతించరు. వీరిని రాజ్ దూత్ లేన్ వైపు డైవర్ట్ చేస్తారు. ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశముంది కాబట్టి ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఇక ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు ఇవాళ మూసివేయనున్నారు.. ట్రాఫిక్ అప్డేట్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా పేజ్ ను అనుసరించాలని కోరారు.