Traffic Restrictions: రేపు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions: ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు

Update: 2023-04-29 11:38 GMT

Traffic Restrictions: రేపు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయనున్నారు. హుస్సేన్ సాగర్‌‌, సైఫాబాద్‌, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రోడ్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు.

వీఐపీల రాకపోకలను బట్టి VV విగ్రహం.. నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ను నిలిపివేయడం లేదా మళ్లింపులు ఉంటాయన్నారు. సెక్రటేరియట్ పరిసరాల్లోని ఎన్టీఆర్‌ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నారు. ఆర్టీసీ బస్సులను లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ మీదుగా మళ్లించనున్నారు. 

Tags:    

Similar News