తాగి బండి నడిపితే రూ.10 వేల ఫైన్.. న్యూ ఇయర్ వేళ మందుబాబులకు పోలీసుల హెచ్చరిక..
Hyderabad: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసుల సూచన
తాగి బండి నడిపితే రూ.10 వేల ఫైన్.. న్యూ ఇయర్ వేళ మందుబాబులకు పోలీసుల హెచ్చరిక..
Hyderabd: నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనం నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. తాగి బండి నడిపిన వారికి భారీ జరిమానాలు విధించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే 10వేల జరిమానాతో పాటు రెండు నెలల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నారు.
కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు వేడుకలు జరుపుకొనే హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటలకు వరకు వాహనాలను అనుమతించడం లేదు దీంతో పాటు పలు ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు రాత్రి నుంచి బేగంపేట, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లు మినహా మిగిలిన ఫ్లై ఓవర్లు అన్నీ మూసివేయనున్నారు.