Vakiti Srihari: బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు.. ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధం

Vakiti Srihari: మక్తల్ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

Update: 2026-02-12 06:46 GMT

Vakiti Srihari: మక్తల్ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ఖండించారు. మహదేవప్ప మృతికి, తనకు కానీ, తన అనుచరులకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి వివరణ - కీలక అంశాలు:

 "నేను మహదేవప్పకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు. ఒకవేళ నేను ఆయనతో మాట్లాడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. అనుమానం ఉంటే నా కాల్ డేటాను పరిశీలించవచ్చు" అని మంత్రి సవాల్ విసిరారు. మహదేవప్ప మృతికి గల అసలు కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే వెల్లడవుతాయని, అప్పటివరకు ఊహాగానాలు చేయవద్దని కోరారు. ఎన్నికల ఒత్తిడి మరియు భయం కారణంగానే ఆయన మనస్తాపానికి గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి గుర్తు చేశారు.

మృతి చెందిన వ్యక్తిని అడ్డం పెట్టుకుని బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చారు.

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపుల వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు డీకే అరుణ, కిషన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News