435 ఏళ్ల హైదరాబాద్ చరిత్ర: ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీ వరకు
435 ఏళ్ల హైదరాబాద్ నగర పరిపాలన మార్పులు, ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీ ఏర్పాటువరకు విస్తరణ, స్పెషల్ ఆఫీసర్ల పాలన వివరాలు తెలుసుకోండి.
435 ఏళ్ల హైదరాబాద్ చరిత్ర: ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీ వరకు
435ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1950లో హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. 1955 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంతో రెండు విలీనం అయ్యాయి. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా మారింది. ఆ సమయంలో 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 2007లో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటైంది. గ్రేటర్ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. టీ క్యూర్ వరకు విస్తరించిన నగర విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లకు చేరింది.
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మేలైన సదుపాయాలు కల్పించాలని పరిపాలనను మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా విభజించారు. ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్లుగా, స్పెషల్ ఆఫీసర్లుగా పని చేసిన వారిలో సి.అర్జునరావు నుంచి సోమేశ్‌కుమార్ వరకు పలువురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులయ్యారు. నగర చరిత్రలో పాలకమండళ్లు లేని స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎంతో కాలం కొనసాగింది. 1971 నుంచి 1988, 1996 నుంచి 2001 వరకు , 2007 నుంచి 2009 , ఆ తర్వాత కొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగింది. కమిషనర్లే స్పెషల్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
పాలక మండలి లేని సమయంలో స్పెషలాఫీసర్‌గా పనిచేసే వారే పాలక మండలి పనులు చేపడుతారు. తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ తాను అనుకున్న పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. 2014లో స్పెషలాఫీసర్‌గా నియమితులైన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ 5రూపాయలకే భోజనం వంటి పథకం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత డాక్టర్ CVSK శర్మ, S.P. సింగ్ కమిషనర్లుగా, స్పెషలాఫీసర్లుగా పని చేశారు.