Independence Day: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Independence Day: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గోల్కొండ కోట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. వేడుకలకు వచ్చే వాళ్లు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. రాణి మహల్ లాన్స్ నుంచి గోల్కండ కోట వరకూ రోడ్లను అధికారులు మూసివేయనున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులను అధికారులు జారీ చేశారు. వేడుకలను చూసేందుకు వచ్చే సాధారణ ప్రజలకు సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు.