Revanth Reddy: సీఎం స్పీచ్‌లో బీటలు వారుతున్న టీఆర్ఎస్ కనిపించింది
Revanth Reddy: హుజూరాబాద్ సభలో కేసీఆర్ మరోసారి అబద్ధాలు చెప్పారన్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy: సీఎం స్పీచ్‌లో బీటలు వారుతున్న టీఆర్ఎస్ కనిపించింది
Revanth Reddy: హుజూరాబాద్ సభలో కేసీఆర్ మరోసారి అబద్ధాలు చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. సీఎం స్పీచ్‌లో బీటలు వారుతున్న టీఆర్ఎస్ కనిపించిందన్నారు ఆయన. హుజూరాబాద్ ఉపఎన్నికపై కేసీఆర్‌లో ఓటమి భయం కన్పిస్తోందన్న రేవంత్ ఒక్క ఉపఎన్నిక కోసం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేయలేదని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు.
దళితుల అభివృద్ధిపై ఏనాడు కేసీఆర్ సమీక్ష నిర్వహించలేదని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. కేసీఆర్‌కు ఇదే చివరి రాజకీయ ప్రసంగంగా భావిస్తున్నామన్నారు. ఈ నెల 18న ఇబ్రహీంపట్నం దళిత, గిరిజనసభ తర్వాత హుజూరాబాద్‌పై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు వివరించారు. కేసీఆర్ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు.