కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌పై ఎలాంటి కేసులు ఉన్నాయి..? అవి ఏమయ్యాయో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం కిషన్ రెడ్డి మరిచిపోయారా..? అని మండిపడ్డారు. ఎంపీగా కూడా అజారుద్దీన్ ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై బీజేపీ నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.