Kishan Reddy: ఇవాళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డి
Kishan Reddy: భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
Kishan Reddy: ఇవాళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డి
Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా గంగాపురం కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్దికి అధిష్టానం తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా రెండు పర్యాయాలు పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇపుడు తాజాగా నాలుగోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షబాధ్యతలను చేపట్టబోతున్నారు.
ఇవాళ ఉదయం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అంబర్ పేటలో జ్యోతీరావుఫూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆతర్వాత బషీర్ భాగ్‌లోని కనకదుర్గమ్మవారి ఆశీసులు అందుకుని, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అక్కడినుంచి అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. అక్కడినుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ప్రదర‌్శనగా నాంపల్లి బీజేపీ కార్యాలయం చేరుకుంటారు.
బీజేపీ రాష్ట్ర నాయకుల సమక్షంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలను సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తారని అధిష్టానం విశ్వసిస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటెల రాజేందర్, బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూరా నర్సయ్యగౌడ్, సమన్వయంతో వ్యవహరించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో భారతీయ జనతాపార్టీని ప్రత్యామ్నాయశక్తిగా తీర్చి దిద్ది, వచ్చే ఎన్ని్కల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపబోతున్నారు.