ఇవాళ కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం

Telangana: మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ గత కొంతకాలంగా రైతుల ఆందోళన

Update: 2023-01-20 04:00 GMT

ఇవాళ కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం

Telangana: ఇవాళ కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం కానుంది. మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ దిగొచ్చింది. రైతులకు మద్దతుగా ఇప్పటివరకు ఇద్దరు బీజేపీ, నలుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కాసేపట్లో అడ్లూర్‌ గ్రామంలో రైతులు సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు.. ఇవాళ కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నేపథ్యంలో.. మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దుపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్‌ కౌన్సి్ల్‌ అత్యవసర భేటీతో ఇవాళ రైతు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఎమ్మెల్యే గంపా గోవర్ధన్‌ ఇంటి ముట్టడిని వాయిదా వేసుకున్నారు రైతులు.

Tags:    

Similar News