తెలంగాణలో ఒక్కరోజే 75 కొత్త కరోనా కేసులు.. ఇద్దరు మృతి

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ బాధితులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. రోజురోజుకు సంఖ్య డబల్ కి చేరుతుంది.

Update: 2020-04-03 15:39 GMT

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ బాధితులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. రోజురోజుకు సంఖ్య డబల్ కి చేరుతుంది.ఇక తెలంగాణలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇవ్వాళ ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు.. ఇందులో ఒకరు షాద్ నగర్ కి చెందిన వారు కాగా, మరొకరు సికింద్రాబాద్ కి చెందినవారు.

తాజాగా దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.. ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229 కి చేరింది. ఇక ఇవ్వాళ 15 మంది కరోనా నుంచి కొలుకున్నారు. దీనితో మొత్తంగా 32 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మృతుల సంఖ్య 11 కి చేరింది.  




 


Tags:    

Similar News