శామీర్‌పేట కాల్పుల కేసు నిందితుడు మనోజ్‌కు పోలీస్ కస్టడీ
Shamirpet Firing Case: మనోజ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
శామీర్‌పేట కాల్పుల కేసు నిందితుడు మనోజ్‌కు పోలీస్ కస్టడీ
Shamirpet Firing Case: హైదరాబాద్ శామీర్‌పేటలో సంచలనం సృష్టించిన కాల్పుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మనోజ్‌ను కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి మనోజ్‌ను కస్టడీకి తీసుకొని మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు.
2003లో స్మితతో సిద్ధార్ధ్‌దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లో సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కేసు పెట్టింది. ఆపై కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారామె. స్మిత కొడుకు ఉన్నత చదువుల విషయమై మనోజ్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని.. బాలుడు చైల్డ్ వెల్ఫేర్ కమీషన్‌కు ఫిర్యాదు చేశాడు.