Bhadradri Kothagudem: నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు.. 200 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
Bhadradri Kothagudem: బూర్గంపాడు నుంచి ఏలేరుకు వెళ్ళే దారిలో రోడ్డుపై ప్రవహిస్తున్నవరదనీరు
Bhadradri Kothagudem: నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు.. 200 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రామచంద్రపురం,ఇరవెండి మధ్య ఉన్న కడియాలబుడ్డి వాగు పొంగిపోర్లుతోంది.దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు నుంచి ఏలేరుకు వెళ్ళే దారిలో కొల్లుచెరువు పొంగి హైవే పై ప్రవహిస్తుండటంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలలో వరి, ప్రత్తి, మొక్కజొన్న, కూరగాయల పంట పొలాలు నీట మునిగాయి. బూర్గంపాడు sc కాలనీ, రామాలయం వీధి ,సారపాక బసప్ప క్యాంపు, భాస్కర్ నగర్ ,సుందరయ్య నగర్ తదితర గ్రామాలు జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాలలోని 200 కుంటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.