Telangana Assembly: రేపటి నుంచి తిరిగి ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ

Telangana Assembly: 16న అసెంబ్లీ, మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం

Update: 2023-12-13 05:27 GMT

Telangana Assembly: రేపటి నుంచి తిరిగి ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ

Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే ఈ రోజు స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. అయితే ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఇంకా ఎవరైనా వేస్తే ఎన్నికను నిర్వహించాల్సి వస్తుంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇక ఎల్లుండి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 16న అసెంబ్లీలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చించనున్నారు.

Tags:    

Similar News