Harish Rao: సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రెండో దశ కంటి వెలుగు
Harish Rao: జనవరి 18 నుంచి జూన్ 30 వరకు రెండోదశ కంటి వెలుగు
Harish Rao: సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రెండో దశ కంటి వెలుగు
Harish Rao: సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన జనవరి 18 నుంచి జూన్ 30 వరకు జరిగే రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని వందరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాకు అదనంగా 35 మంది వైద్యులను రిక్రూట్ చేశామని ఇప్పటికే 10లక్షల కళ్ల జోళ్లు ప్రతి జిల్లాకు చేరుకున్నాయన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు.