PM Modi: ప్రధాని మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు

PM Modi: ఉదయం 8 గం.లకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని మోడీ

Update: 2023-07-07 02:05 GMT

PM Modi: ప్రధాని మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు

PM Modi: ప్రధాని మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ప్రధాని మోడీ.. 9 గంటల 45 నిమిషాలకు హకీంపేటకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరతారు. 10 గంటల 30 నిమిషాల తర్వాత వరంగల్ చేరుకోనున్న ప్రధాని.. భద్రకాళి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో పూజల అనంతరం ఆర్ట్స్ కాలేజ్‌కు వెళ్తారు.

11 గంటల నుంచి 11 గంటల 35 నిమిషాల వరకు పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. 11 గంటల 45 నిమిషాలకు వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 12 గంటల 50 నిమిషాలకు వరంగల్ నుంచి తిరుగు ప్రయాణం కానున్న ప్రధాని.. హకీంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిమిషాలకు రాజస్థాన్‌ వెళ్తారు.

Tags:    

Similar News