No Water Supply in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్
No Water Supply in Hyderabad: ఈ అంతరాయం డిసెంబర్ 27 ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
No Water Supply in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్
No Water Supply in Hyderabad: భాగ్యనగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్–1లో అత్యవసర మరమ్మత్తులు చేపట్టాల్సి ఉండటంతో, నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ అంతరాయం డిసెంబర్ 27 ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
కృష్ణా ఫేజ్–1 పరిధిలోని ప్రధాన పైపులైన్లలో లీకేజీలు ఏర్పడటంతో నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న పైపులకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు దెబ్బతిన్న వాల్వులను మార్చనున్నారు. అలాగే కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో పాత భాగాలను తొలగించి కొత్తవి అమర్చనున్నారు. ఈ కారణంగానే సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు
♦ డివిజన్–1: మీరాలం, కిషన్‌బాగ్, బహదూర్‌పురా, ఫలక్‌నామా, మొగల్‌పురా, బాల్షెట్టీ కేట్, జహనుమా
♦ డివిజన్–2: సంతోష్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, వినయ్‌నగర్, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, మహబూబ్ మాన్షన్
♦ డివిజన్–4: బొగ్గులకుంట పరిసర ప్రాంతాలు
♦ డివిజన్–5: నారాయణగూడ, ఆడిక్‌మెట్, శివం రోడ్డు, చిల్కలగూడ రిజర్వాయర్ పరిధి
♦ డివిజన్–8: అలియాబాద్, రియాసత్ నగర్ రిజర్వాయర్ ఏరియాలు
♦ డివిజన్–10: దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని ప్రధాన ప్రాంతాలు
♦ డివిజన్–18: హార్డ్‌వేర్ పార్క్, తుక్కుగూడ, జల్పల్లి, ఫాబ్ సిటీ
♦ డివిజన్–20: మన్నెగూడ పరిసరాలు
ప్రజలకు జలమండలి సూచనలు
మరమ్మత్తుల అనంతరం సరఫరా పునఃప్రారంభమైనప్పటికీ పైపుల్లో గాలి ఉండటం వల్ల తొలుత నీటి పీడనం తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల ముందస్తుగా అవసరమైనంత నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు సంపులను ముందుగానే నింపుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో జలమండలి ట్యాంకర్లను ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాంకర్లు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.