Komatireddy Raj Gopal Reddy: గొర్రెల పథకం కింద లబ్ధిదారులకు వేసిన డబ్బులను..
* కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేస్తోంది
గొర్రెల పథకం కింద లబ్ధిదారులకు వేసిన డబ్బులను
Komitireddy rajagopal Reddy: కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేస్తోందని మునుగోడు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. గొర్రెల పథకం పేరుతో ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమచేసిన కేసీఆర్ ఎన్నికలు తర్వాత డబ్బులు వెనకకు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గొల్ల కురుమలతో కలిసి నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అవసరానికి తగ్గట్లుగా హామీలివ్వడం మోసం చేయడం వారికి అలవాటేనన్నారు. ఇప్పటికైనా లబ్దిదారుల ఖాతాల్లో గొర్రెల పథకం డబ్బులు జమచేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.