TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు విచారణ
TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లను ఇవాళ కూడా హైకోర్టు విచారించనుంది.
TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు విచారణ
TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లను ఇవాళ కూడా హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల వాదనలు ముగిశాయి. ఇవాళ కూడా ప్రతివాదుల తరఫున వాదనలు కొనసాగనున్నాయి. గ్రూప్-1పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈవాల్యుయేషన్ పాదర్శకంగా జరిగినట్లు TGPSC పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికకాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేశారని, వాటిపై ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంపిక లిస్టును రద్దు చేసిందన్నారు. కాగా.. టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలోనే పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో తేడాలున్నట్లుగా పలు అనుమానాలకు తావిస్తోందని ప్రతివాదుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.