Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. 10తలల కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యకర్తలు
Hyderabad: పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత వాతావరణం
Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. 10తలల కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యకర్తలు
Gandhi Bhavan: హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్ది దగా పేరుతో ఇవాళ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని 10 తలల దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది.