Telangana: అమెరికాలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి

Telangana: 8 రోజుల తర్వాత స్వగృహానికి చేరుకున్న మృతదేహం

Update: 2024-02-26 07:45 GMT

Telangana: అమెరికాలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి

Telangana: అమెరికాలో మృతిచెందిన సికింద్రాబాద్‌కు చెందిన రుత్విక్ మృతదేహం స్వగృహానికి చేరుకుంది. వారం రోజుల తర్వాత తిరుమలగిరిలోని కాంటబస్తీలోని రుత్విక్ నివాసానికి చేరుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూడటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలె అమెరికాలోనే MS పూర్తి చేసిన రుత్విక్.. స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే రుత్విక్ మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

Tags:    

Similar News