14 తర్వాతే టెన్త్‌ పరీక్షల షెడ్యూలు ప్రకటన.. వాట్సాప్ లో వైరల్‌ అవుతున్న..

Update: 2020-04-04 05:26 GMT

తెలంగాణ‌లో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎలాంటి నూతన షెడ్యూల్‌ ప్రకటించలేదని పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ అంటూ వాట్సా్‌పలో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవమని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు.

ఈనెల14 తర్వాత ప్రభుత్వంతో చర్చించి నూతన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు.

Tags:    

Similar News